త్వరగా ఉద్యోగం రావాలంటే..?

ఇంటర్‌ (ఎంపీసీ) చదివి, దూరవిద్యలో డిగ్రీ, ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో త్వరగా ఉద్యోగం రావాలంటే ఏ ప్రోగ్రామ్స్‌ నేర్చుకోవాలి?

Published : 23 May 2023 00:36 IST

ఇంటర్‌ (ఎంపీసీ) చదివి, దూరవిద్యలో డిగ్రీ, ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో త్వరగా ఉద్యోగం రావాలంటే ఏ ప్రోగ్రామ్స్‌ నేర్చుకోవాలి?

ఎన్‌.వాసురెడ్డి

* మీరు ఎంసీఏ ఎప్పుడు పూర్తి చేశారు, ఏదైనా ఉద్యోగానుభవం ఉందా/లేదా అనే వివరాలు తెలియజేయలేదు. ప్రస్తుతం డేటాసైన్స్‌లో చాలా ఉద్యోగావకాశాలున్నాయి. ఆ రంగంలో స్థిరపడాలంటే.. ఏదైనా ప్రముఖ విద్యాసంస్థనుంచి డేటాసైన్స్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేయండి. ఆసక్తి ఉంటే బిజినెస్‌ అనలిటిక్స్‌లో ఎంబీఏ కూడా చేయొచ్చు. డేటాసైన్స్‌లో ఆసక్తి లేకపోతే, డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సుల గురించీ ఆలోచించండి. అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ లాంటి కోర్సులు చేసినట్లయితే, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. అలా కాకుండా, జావా ప్రోగ్రామింగ్‌, ఒరాకిల్‌, ఈఆర్‌పీ, పైతాన్‌, వెబ్‌ డిజైనింగ్‌ లాంటి కోర్సులూ చేయొచ్చు. యూనివర్సిటీ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కాకుండా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశించాలంటే ఉద్యోగానుభవం, ప్రస్తుతం మార్కెట్‌కి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ల్లో పనిచేయగల సామర్ధ్యం అవసరం. మీ యూనివర్సిటీలో ఎంసీఏ చదివి, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారితో మాట్లాడి వారి సలహాలను కూడా తీసుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని