ఇంజినీరింగ్‌ చేశాక...

ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఉద్యోగ విప్లవాల తరువాత సంప్రదాయ కోర్సులైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లాంటి కోర్సులు చదివినవారికి ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయాయి

Published : 27 Jun 2023 23:55 IST

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు చేయాలనివుంది. ఏడాది వ్యవధి కోర్సులున్నాయా?    

ఎ.రాజు, మచిలీపట్నం
ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఉద్యోగ విప్లవాల తరువాత సంప్రదాయ కోర్సులైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లాంటి కోర్సులు చదివినవారికి ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇలాంటి సంప్రదాయ కోర్సులు చదివినవారు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం పొందలేకపోతే, కాలేజ్‌ నుంచి బయటకి వచ్చాక సొంతంగా ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టంగా ఉంది. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందాలంటే నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడం చాలా అవసరం. ఆసక్తి ఉంటే ఏవైనా స్వల్పకాలిక ప్రోగ్రామింగ్‌ కోర్సులు నేర్చుకొని ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించండి. డేటా సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి ఎంబీఏ చేసే అవకాశం కూడా ఉంది. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లోనే స్వల్పకాలిక కోర్సుల విషయానికొస్తే- ఆటో క్యాడ్‌, త్రీడీ ప్రింటింగ్‌, మెకట్రానిక్స్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, ప్రెడిక్టివ్‌ మెయింటెనెన్స్‌, డీప్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ విత్‌ పైతాన్‌, రోబోటిక్‌ ఆపరేటింగ్‌ సిస్టం, మ్యాట్‌ ల్యాబ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, డిజైన్‌ ఆఫ్‌ మౌల్డ్స్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. మరిన్ని స్వల్పకాలిక కోర్సుల వివరాల కోసం సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ వెబ్‌సైట్‌ సందర్శించండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు