ఎంబీబీఎస్‌ కాకుండా..

బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ చదివాను. ఎంబీబీఎస్‌ కాకుండా .. ఈ గ్రూపు విద్యార్థులు ఏయే వృత్తి విద్యా కోర్సులు చదవొచ్చు?

Published : 31 Jul 2023 00:12 IST

బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ చదివాను. ఎంబీబీఎస్‌ కాకుండా .. ఈ గ్రూపు విద్యార్థులు ఏయే వృత్తి విద్యా కోర్సులు చదవొచ్చు?

కె. వెంకటేష్‌

  • ఇంటర్‌ బైపీసీ తర్వాత నర్సింగ్‌, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌, జెనెటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్సెస్‌, ఫిజియో థెరపీ,  ఫార్మసీ, ఆప్టోమెట్రీ, హెల్త్‌ సైకాలజీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, నేెచురోపతి, న్యూట్రిషన్‌, హోమ్‌ సైన్స్‌, హార్టి కల్చర్‌, ఆక్వా కల్చర్‌, ఫిషరీస్‌, ఫారెస్ట్రీ, జియాలజీ, ఫుడ్‌ సైన్స్‌, న్యూరో సైన్స్‌ కోర్సులు చదివే అవకాశం ఉంది. బయాలజీకి సంబధం లేని ప్రొఫెషనల్‌ కోర్సుల విషయానికొస్తే- ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, బీబీఏ, టూరిజం, విజువల్‌ డిజైన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మల్టీమీడియా, మాస్‌ కమ్యూనికేషన్‌ లాంటి కోర్సులు చదవవచ్చు. సాధారణంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రతి సంవత్సరం జులైౖలోగా పూర్తవుతాయి. కొన్ని కోర్సులకు ప్రవేశ పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత అడ్మిషన్లు నిర్వహిస్తారు. మరి కొన్ని కోర్సుల్లో ఇంటర్‌లో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని