ఇన్నేళ్ల విరామం తర్వాత..

ఎనిమిదో తరగతితో ఆపేశాను. ఇప్పుడు చదువుకోవాలని ఉంది. నా వయసు 33 సంవత్సరాలు. ఏ కోర్సు ఎంచుకుని.. ఎలా చదవాలి

Published : 07 Aug 2023 00:24 IST

ఎనిమిదో తరగతితో ఆపేశాను. ఇప్పుడు చదువుకోవాలని ఉంది. నా వయసు 33 సంవత్సరాలు. ఏ కోర్సు ఎంచుకుని.. ఎలా చదవాలి?

వి.ఆశారాణి

  •  చదువుకు వయసుతో పనిలేదు. ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. కాకపోతే, మీరు ఎందుకోసం చదవాలనుకుంటున్నారో తెలుసుకోండి. విజ్ఞానం కోసం, సమాజాన్ని తెలుసుకోవడానికి, పిల్లల్ని బాగా చదివించడానికి, వ్యాపారం కోసం, సమాజంలో హోదా, సమాజ సేవ, చిన్ననాటి కలల్ని నెరవేర్చుకోడం...ఇలాంటివి ఏమైనా కావొచ్చు. ఏ కారణంతో అయినా సరే, ఈ వయసులో చదువు కొనసాగించాలన్న మీ ఆశయం అభినందనీయం. ముందుగా మీరు పదో తరగతిని ప్రైవేటుగా పరీక్ష రాసే ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి పూర్తి చేయండి. ఇంటర్‌ని కూడా ప్రైవేటుగా కానీ, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా గాని పూర్తి చేయండి. ఇంకా ఆసక్తి ఉంటే, ఓపెన్‌ యూనివర్సిటీ లేదా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేయండి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే ఇంటర్‌ తరువాత డీఈడీ… కానీ, డిగ్రీ తరువాత బీఈడీ… కానీ చేయవచ్చు. అలా కాకుంటే పదో తరగతి/ ఇంటర్‌ తరువాత నచ్చిన ఒకేషనల్‌ కోర్సు చదవండి. ఇంటర్‌/ డిగ్రీ తరువాత ఉద్యోగం త్వరగా లభించే కంప్యూటర్‌, టూరిజం, కుకింగ్‌, ఎంబ్రాయిడరీ, న్యూట్రిషన్‌, హోమ్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ /డిప్లొమా కోర్సులు చేయండి. అవకాశం ఉంటే పీజీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయండి.  

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని