ఇస్లామిక్‌ స్టడీస్‌తో..

ఎంఏ ఇస్లామిక్‌ స్టడీస్‌ పూర్తి చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి?

Updated : 31 Aug 2023 01:08 IST

ఎంఏ ఇస్లామిక్‌ స్టడీస్‌ పూర్తి చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి?

అల్తాఫ్‌

  • ఎంఏ ఇస్లామిక్‌ స్టడీస్‌ చదివితే ఇస్లామిక్‌ ట్రాన్స్‌లేటర్‌, ఇస్లామిక్‌ జర్నలిస్టు అవొచ్చు. బీఈడీ చేసి ఇస్లామిక్‌ టీచర్లుగా, పీహెచ్‌డీ చేసి ఇస్లామిక్‌ అధ్యాపకులుగా, ఇస్లామిక్‌ పరిశోధకులుగా, ఇస్లామిక్‌ కంటెంట్‌ రైటర్లుగా, ఇస్లాం మత ప్రచారకులుగా, క్యాలిగ్రాఫర్లుగా ఉద్యోగాలు చేయవచ్చు. ఇవేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థల్లో, వ్యాపార సంస్థల్లో, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ ఆఫీసుల్లో, డిఫెన్స్‌, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్లలో కొలువుల్లో చేరే అవకాశం ఉంది. వీటితో పాటు డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని