సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా?

సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు ఎస్‌సీఎం (సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌) రంగం వైపు వెళ్లాలనుంది. ఎంబీఏ చదవాలనుకుంటున్నాను.

Published : 05 Sep 2023 01:04 IST

సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు ఎస్‌సీఎం (సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌) రంగం వైపు వెళ్లాలనుంది. ఎంబీఏ చదవాలనుకుంటున్నాను. ఈ కోర్సును దూరవిద్యలో అందించే యూనివర్సిటీలు, ఫీజు వివరాలు చెప్పండి.

విశ్వనాథ్‌

ముందుగా మీరు సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌సీఎం) కోర్సును ఎందుకు చదవాలనుకుంటున్నారు.. ఇది చదివాక ఏ రంగంలో, ఏ ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారు.. అనే విషయాలపై స్పష్టత అవసరం. సాధారణంగా సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్‌గా కానీ, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లో ఒక సబ్జెక్ట్‌గా కానీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేకమైన ఎంబీఏ-ఎస్‌సీఎం కోర్సును కూడా అందిస్తున్నాయి. చాలా ప్రైవేటు యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లోనూ ఎస్‌సీఎం ఎంబీఏ అందిస్తున్నాయి. మణిపాల్‌, నార్సీమోన్జి, సింబయాసిస్‌, లవ్లీ ప్రాఫెషనల్‌, శివనాడార్‌, ఎస్‌ఆర్‌ఎం, శాస్త్ర, డీవై పాటిల్‌, కోనేరు లక్ష్మయ్య, విజ్ఞాన్‌, జైన్‌ యూనివర్సిటీలతోపాటు మరికొన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ కోర్సు ఎంబీఏ/పీజీ డిప్ల్లొమా ప్రోగ్రామ్‌ల్లో అందుబాటులో ఉంది.

ఫీజు విషయానికొస్తే.. ఒక్కో విద్యా సంస్థలో, ఒక్కో రకంగా ఉంటోంది. మన దేశంలో నాలుగు సెమిస్టర్లతో కూడిన రెండు సంవత్సరాల ఎంబీఏ - సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు కనీసం రూ. యాభై వేలు చెల్లించాలి. ఏదైనా యూనివర్సిటీని ఎంచుకునే ముందు.. ఆ యూనివర్సిటీకి, కోర్సుకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అయితే ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్‌గా చదివితేనే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని