నా నిర్ణయం సరైనదేనా?

బీఫార్మసీ చదివాను. దీనితో ఏ ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలుంటాయి? ప్రస్తుతం గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. నా నిర్ణయం సరైనదేనా?

Updated : 06 Sep 2023 00:18 IST

బీఫార్మసీ చదివాను. దీనితో ఏ ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలుంటాయి? ప్రస్తుతం గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. నా నిర్ణయం సరైనదేనా?

 ఎం. విజయ

బీఫార్మసీ చదివిన తరువాత ఎంఫార్మసీ, ఫార్మ్‌ డీ…, ఎంఎస్సీ- ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌, ఎంబీఏ- ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబీఏ- హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు చేయవచ్చు. వీటితో పాటు ఫార్మసీ మేనేజ్‌మెంట్‌, క్లినికల్‌ రిసెర్చ్‌, డ్రగ్‌ స్టోర్‌ మేనేజ్‌మెంట్‌, క్లినికల్‌ ట్రయల్‌ మేనేజ్‌మెంట్‌ల్లో డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు కూడా చేసే వీలుంది. ఉద్యోగావకాశాల విషయానికొస్తే- బీఫార్మసీ విద్యార్హతతో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హాస్పిటల్‌ ఫార్మసిస్ట్‌, కమ్యూనిటీ ఫార్మసిస్ట్‌, క్లినికల్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌, క్వాలిటీ కంట్రోల్‌ అసోసియేట్‌, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌, ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌, మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షనిస్ట్‌ లాంటి ఉద్యోగావకాశాలుంటాయి.

ప్రస్తుతం గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేరవుతున్నాను అన్నారు. ఈ పరీక్షలకు అన్నిరకాల డిగ్రీలు చదివినవారూ అర్హులే కాబట్టి, పోటీ ఎక్కువ. అంతేకాకుండా మీరు బీఫార్మసీలో చదివిన సిలబస్‌కూ, గ్రూప్స్‌ సిలబస్‌కూ సంబంధం ఉండదు. దీంతో మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఫార్మసీ ఉద్యోగాలకు ఫార్మసీ చదివినవారితోనే పోటీపడతారు కాబట్టి పోటీకి తక్కువ అవకాశం ఉంటుంది. గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో మీరు కనీసం రెండు సంవత్సరాలు ఫార్మసీ సబ్జెక్టుకు దూరం అవుతారు. ఒకవేళ మీరు  గ్రూప్స్‌లో విజయం సాధించలేకపోతే తరువాత ఫార్మసీ రంగంలో ఉద్యోగం పొందడం కొంత కష్టం కావొచ్చు. గ్రూప్స్‌ పరీక్షలు రాయాలా, ఫార్మసీ రంగంలో ఉద్యోగం చేయాలా అనేది మీ కెరియర్‌ లక్ష్యాల పై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని