సేల్స్‌ కాకుండా ఏ విభాగాలు మేలు?

బ్యాంకులో ఫైనాన్స్‌కు సంబంధించిన విభాగాల్లో పనిచేసినట్లయితే మీరు ఎంబీఏలో చదివిన ఫైనాన్స్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

Published : 02 Oct 2023 00:07 IST

ఎంబీఏ ఫైనాన్స్‌ చదివి ఐసీఐసీఐ రిటైల్‌ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్నాను. సేల్స్‌లో కాకుండా ఇతర ఏ విభాగాల్లో పనిచేస్తే భవిష్యత్తు బాగుంటుంది? 

రోహిత్‌కృష్ణ

బ్యాంకులో ఫైనాన్స్‌కు సంబంధించిన విభాగాల్లో పనిచేసినట్లయితే మీరు ఎంబీఏలో చదివిన ఫైనాన్స్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న వివిధ రకాల విభాగాలన్నీ పరిశీలించి, వాటిలో ఫైనాన్స్‌ సంబంధిత రంగాలను ఎంచుకొని అందుకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోండి. సాధారణంగా బ్యాంకుల్లో ఫైనాన్స్‌కి సంబంధించి  కార్పొరేట్‌ క్రెడిట్‌, రిటైల్‌ క్రెడిట్‌, ట్రెజరీ, ఫారెక్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ లాంటి విభాగాలుంటాయి. ఏ విభాగంలో పనిచేస్తే మంచి భవిష్యత్‌ ఉంటుంది అని అడిగారు. మీ దృష్టిలో మంచి భవిష్యత్తు అంటే ఎక్కువ వేతనం పొందడమా? పదోన్నతా? చేసే ఉద్యోగంలో సంతృప్తా? అనే విషయాలపై స్పష్టత అవసరం. మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు