విదేశాల్లో వ్యవసాయ కోర్సులో చేరాలని..

బీఎస్సీ (మ్యాథ్స్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌) 2016లో చదివాను. సొంత భూమిలో ఫార్మా మేనేజర్‌గా చేస్తున్నాను. ఇప్పుడు విదేశాల్లో వ్యవసాయానికి సంబంధించిన కోర్సు చదవాలనివుంది. మీ సలహా?

Published : 05 Oct 2023 00:05 IST

బీఎస్సీ (మ్యాథ్స్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌) 2016లో చదివాను. సొంత భూమిలో ఫార్మా మేనేజర్‌గా చేస్తున్నాను. ఇప్పుడు విదేశాల్లో వ్యవసాయానికి సంబంధించిన కోర్సు చదవాలనివుంది. మీ సలహా?

భూమేష్‌ రెడ్డి

వ్యవసాయానికి సంబంధించి విదేశీ విద్యాసంస్థల్లో కొన్ని వందల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో బీఎస్సీ/ ఎంఎస్సీ అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌లో ఉన్న ప్రతి సబ్జెక్టులో ఒక పీజీ కోర్సు చదివే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా అగ్రానమీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇరిగేషన్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సేఫ్టీ, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌, ప్లాంట్‌ బ్రీడింగ్‌, అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, ప్లాంట్‌ జెనెటిక్స్‌, అగ్రికల్చర్‌ బయాలజీ, అగ్రికల్చర్‌ స్టడీస్‌, అగ్రి ఫుడ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ బిజినెస్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌, అగ్రికల్చరల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌, ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ, క్లైమేట్‌ ఛేేంజ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రెసిషన్‌ అగ్రికల్చర్‌, ఫామ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌, అగ్రికల్చరల్‌ ఇన్నోవేషన్‌ లాంటి కోర్సులున్నాయి. వీటిలో మీకు నచ్చిన కోర్సును ఏ దేశంలో, ఏయే యూనివర్సిటీల్లో    చదవాలనుకొంటున్నారో సంబంధిత యూనివర్సిటీల   వెబ్‌సైట్‌లను సందర్శించి మరిన్ని వివరాలను   తెలుసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని