దూరవిద్యలో ఇంజినీరింగ్‌..?

డిప్లొమా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. తర్వాత ఉద్యోగం చేస్తూ.. బీటెక్‌ని దూరవిద్యలో చదవాలనుంది. ఈ కోర్సును దూరవిద్యలో ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి

Published : 29 Nov 2023 00:58 IST

డిప్లొమా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. తర్వాత ఉద్యోగం చేస్తూ.. బీటెక్‌ని దూరవిద్యలో చదవాలనుంది. ఈ కోర్సును దూరవిద్యలో ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి?

- ఎస్‌.మోహన్‌మౌళి

ఇంజినీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గానే చదవాలి. ఇలాంటి కోర్సుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు కూడా చాలా అవసరం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ, మీరు ఈవినింగ్‌ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చదివే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సాయంకాలం బదులు శని/ ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారి ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌) / ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే, ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కాకపోతే, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ కోర్సును కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో చదివే అవకాశాలు రావచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు