మైక్రో బయాలజీలో పీజీ చేయాలంటే..?

మాలిక్యులర్‌ మైక్రోబయాలజీ పీజీ అడ్మిషన్లు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎప్పుడు మొదలవుతాయి? ప్రవేశపరీక్ష ఉంటుందా? ఈ కోర్సును అందించే ఇతర ప్రముఖ విద్యాసంస్థలేమిటి?

Updated : 01 Jan 2024 05:23 IST

మాలిక్యులర్‌ మైక్రోబయాలజీ పీజీ అడ్మిషన్లు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎప్పుడు మొదలవుతాయి? ప్రవేశపరీక్ష ఉంటుందా? ఈ కోర్సును అందించే ఇతర ప్రముఖ విద్యాసంస్థలేమిటి?

సాయి సంకీర్తన, హైదరాబాద్‌

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో మైక్రో బయాలజీతో పాటు ఇతర పీజీ ప్రవేశాలు కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ)- పీజీ స్కోరు ఆధారంగా జరుగుతాయి. జులై 2024లో విద్యాసంవత్సరం మొదలవుతుంది.

సీయూఈటీ నోటిఫికేషన్‌ ఇటీవలే వెలువడింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను జనవరి 24 వరకు స్వీకరిస్తారు. పరీక్షలు మార్చి 11 నుంచి 28 వరకు రోజూ 3 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. సీయూఈటీలో సాధించిన స్కోరుతో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలూ, డీమ్డ్‌ యూనివర్సిటీలూ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ చదువుకోవచ్చు.

మైక్రోబయాలజీ పీజీ కోర్సును అందించే దేశంలోని ఇతర ప్రముఖ విద్యాసంస్థలు-  

  • పాండిచ్చేరి యూనివర్సిటీ
  • దిల్లీ యూనివర్సిటీ
  • మదురై  కామరాజ్‌ యూనివర్సిటీ
  • యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతా
  • ప్రెసిడెన్సీ యూనివర్సిటీ
  • అమృత యూనివర్సిటీ
  • ఎంఎస్‌ రామయ్య  యూనివర్సిటీ.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు