అధ్యాపక హోదా అందుకోవాలంటే?

(సంస్కృతం) పూర్తిచేశాను. ఎంఏ తర్వాత అధ్యాపక ఉద్యోగం సంపాదించాలంటే ఏ పరీక్షలు రాయాలి?

Published : 03 Jan 2024 00:06 IST

బి.ఎ. (సంస్కృతం) పూర్తిచేశాను. ఎంఏ తర్వాత అధ్యాపక ఉద్యోగం సంపాదించాలంటే ఏ పరీక్షలు రాయాలి?

 నీరజ

సంస్కృత విభాగంలో ఇంటర్మీడియట్‌ స్థాయిలో బోధించడానికి లెక్చరర్‌ అవ్వాలంటే ఎంఏలో కనీసం 55% మార్కులు పొందివుండాలి. డిగ్రీ కళాశాల/ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అవ్వాలంటే- అదనంగా సంస్కృతంలో యూజీసీ నెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత కూడా సాధించాలి. నెట్‌/ సెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోతే, పీహెచ్‌డీ అయినా చేసి ఉండాలి. యూజీసీ నియమాలు పాటించే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవే నిబంధనల ప్రకారం నియామకాలు చేపడతారు. ఈ మధ్యనే నెట్‌ పరీక్షలో హిందూ స్టడీస్‌, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ అని రెండు కొత్త సబ్జెక్టులను కూడా చేర్చారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాల కోసం ఆయా విభాగాలకు సంబంధించిన శాస్త్ర విషయాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్‌ అవ్వాలంటే.. సంబంధిత పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారు నిర్వహించే రాత పరీక్షలో మెరుగైన ప్రతిభ కనపర్చి, ఆ తర్వాత ఇంటర్వ్యూలోనూ విజయం సాధించటం అవసరం.         

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని