పీఈటీ టీచర్‌ అవ్వాలంటే?

కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. దూరవిద్యలో బీపీఈడీ చేయాలనుంది. అవకాశం ఉందా? పీఈటీ టీచర్‌ అవ్వాలంటే ఏ అర్హతలుండాలి?  

Published : 24 Jan 2024 23:35 IST

కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. దూరవిద్యలో బీపీఈడీ చేయాలనుంది. అవకాశం ఉందా? పీఈటీ టీచర్‌ అవ్వాలంటే ఏ అర్హతలుండాలి?         

 - బి.రాము

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నియంత్రిస్తుంది. బీపీఈడీని దూరవిద్య  ద్వారా అందించడానికి ఎన్‌సీటీఈ నిబంధనలు అనుమతించవు. అందువల్ల మనదేశంలో ఏ యూనివర్సిటీ కూడా బీపీఈడీని దూరవిద్య ద్వారా అందించడం లేదు. మీకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అవ్వాలన్న కోరిక బలంగా ఉంటే.. ప్రస్తుతం చేస్తున్న కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రెండు సంవత్సరాలు సెలవు పెట్టి, బీపీఈడీని రెగ్యులర్‌ విధానంలో చదవండి.

బీఈడీ, బీపీఈడీ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, జర్నలిజం, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గా చదివితేనే వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయి. మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇక ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అర్హతల విషయానికొస్తే- ఏదైనా డిగ్రీ చదివాక, బీపీఈడీ శిక్షణ పొంది, టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టులో మంచి ప్రతిభ కనబర్చాలి. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అవ్వాలంటే.. వీటన్నింటి కంటే ముందు క్రీడల పట్ల విపరీతమైన ఇష్టంతో పాటు పిల్లలకు క్రీడలు నేర్పడంలో ఆసక్తి ఉండటం చాలా ముఖ్యం.

 - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని