స్పీచ్‌ థెరపీలో ఆన్‌లైన్‌ కోర్సులున్నాయా?

నేనో ఉపాధ్యాయుణ్ని. స్పీచ్‌ థెరపీ ద్వారా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించాలని ఉంది. కానీ అందుకు తగ్గ విద్యార్హత లేదు. స్పీచ్‌ థెరపీ కోర్సులను ఆన్‌లైన్‌లో అందించే సంస్థలున్నాయా?

Updated : 07 Feb 2024 00:07 IST

నేనో ఉపాధ్యాయుణ్ని. స్పీచ్‌ థెరపీ ద్వారా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించాలని ఉంది. కానీ అందుకు తగ్గ విద్యార్హత లేదు. స్పీచ్‌ థెరపీ కోర్సులను ఆన్‌లైన్‌లో అందించే సంస్థలున్నాయా?

తేజ

ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించడానికి స్పీచ్‌ థెరపీ కోర్సులను నేర్చుకోవాలన్న మీ కోరిక అభినందనీయం. సాధారణంగా ఇలాంటి కోర్సులను ప్రత్యక్ష విధానంలో చదివితేనే నైపుణ్యాలు మెరుగవుతాయి. మీకు రెగ్యులర్‌ కోర్సులు చదవడానికి వీలు అవ్వకపోతే- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌, దిల్లీ స్టేట్‌ గవర్నమెంట్‌ పారామెడికల్‌ కౌన్సిల్‌, యుడెమిల ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు చేసే అవకాశం ఉంది. చాలా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు ఈఎన్‌టీ హాస్పిటల్స్‌ కూడా స్పీచ్‌ థెరపీలో ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని