బీఎస్సీ తర్వాత ఉద్యోగం చేయాలంటే..?

బీఎస్సీ (బీజడ్‌సీ) గత ఏడాది పూర్తయ్యింది. ఎమ్మెస్సీ చేయాలనుకోవడం లేదు. ఏదైనా శిక్షణ తీసుకుని ఉద్యోగం చేస్తే బాగుంటుందనుకుంటున్నా. నా అర్హతకు ఏ ఉద్యోగాలు తగినవి?

Published : 14 Feb 2024 00:04 IST

బీఎస్సీ (బీజడ్‌సీ) గత ఏడాది పూర్తయ్యింది. ఎమ్మెస్సీ చేయాలనుకోవడం లేదు. ఏదైనా శిక్షణ తీసుకుని ఉద్యోగం చేస్తే బాగుంటుందనుకుంటున్నా. నా అర్హతకు ఏ ఉద్యోగాలు తగినవి?

- దుర్గాదేవి

 సాధారణంగా బీఎస్సీ (బీజడ్‌సీ) చదివినవారికి అగ్రోనమిస్ట్‌, బయోకెమిస్ట్‌, బయో ఫిజిసిస్ట్‌, ఎపిడమాలజిస్ట్‌, ఫుడ్‌ సైంటిస్ట్‌, హార్టికల్చరిస్ట్‌, ఇమ్యునాలజిస్ట్‌, న్యూట్రిషనిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌...ఇలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు పీజీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఏవైనా సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. హెల్త్‌కేర్‌ రంగంపై ఆసక్తి ఉంటే అనస్థీషియా టెక్నీషియన్‌, డయాలసిస్‌ టెక్నీషియన్‌, ఈసీజీ టెక్నీషియన్‌, న్యూరో ఫిజియాలజీ టెక్నీషియన్‌, ఈఎన్‌టీ టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ సేఫ్టీ, మెడికల్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆఫ్తల్మాలజీ, డెంటల్‌ హైజీనిస్ట్‌, డెంటల్‌ మెకానిక్‌, డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్‌, పల్మనరీ టెక్నీషియన్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్‌గా, సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా కూడా పనిచేసే అవకాశాలుంటాయి. కోడింగ్‌పై ఆసక్తి ఉంటే మెడికల్‌ కోడింగ్‌లో శిక్షణ తీసుకొని మెడికల్‌ కోడర్‌గానూ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవే కాకుండా- సీక్వెన్సింగ్‌, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌, మాలిక్యులర్‌ బయాలజీ, బయో స్టాటిస్టిక్స్‌ల్లో కూడా సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే ఉపాధ్యాయ శిక్షణ పొంది టీచర్‌గా స్థిరపడవచ్చు.  

 - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌ కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని