వీఎల్‌ఎస్‌ఐలో ఏ కోర్సులు?

సెమీ కండక్టర్ల రంగంలో భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు బాగుంటాయని విన్నాను. వీఎల్‌ఎస్‌ఐలో ప్రవేశించడానికి ఏ కోర్సులు ఉపయోగపడతాయి? ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో వీఎల్‌ఎస్‌ఐని ఎంచుకోవచ్చు?

Published : 04 Mar 2024 00:01 IST

సెమీ కండక్టర్ల రంగంలో భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు బాగుంటాయని విన్నాను. వీఎల్‌ఎస్‌ఐలో ప్రవేశించడానికి ఏ కోర్సులు ఉపయోగపడతాయి? ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో వీఎల్‌ఎస్‌ఐని ఎంచుకోవచ్చు?

వెంకట సాయి

  • నిత్య జీవితంలో మనం వాడుతున్న కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, డిజిటల్‌ కెమెరాల్లో సెమీకండక్టర్‌లను ఎక్కువగా వాడుతుంటారు. కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సెమీకండక్టర్‌ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సెమీకండక్టర్‌ల తయారీలో వీఎల్‌ఎస్‌ఐ (వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేషన్‌ టెక్నాలజీ)ని ఎక్కువగా వాడటంవల్ల సెమీకండక్టర్‌ పరిశ్రమను వీఎల్‌ఎస్‌ఐ ఇండస్ట్రీ అనీ అంటారు. ఈ టెక్నాలజీని మైక్రో ప్రాసెసర్‌, మెమరీ చిప్‌ల తయారీలో ఉపయోగిస్తారు. వీఎల్‌ఎస్‌ఐ రంగంలో నైపుణ్య శిక్షణ పొందినవారికి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచిలో దీన్ని స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. అవగాహన పెంచుకోవాలనుకుంటే- వివిధ ఐఐటీలు/ట్రిపుల్‌ ఐటీలు/ ఎన్‌ఐటీలు అందిస్తున్న వీఎల్‌ఎస్‌ఐ క్యాడ్‌, బేసిక్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, అడ్వాన్స్‌డ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, డిజిటల్‌ వీఎల్‌ఎస్‌ఐ టెస్టింగ్‌, వీఎల్‌ఎస్‌ఐ డేటా కన్వర్షన్‌ సర్క్యూట్స్‌, వీఎల్‌ఎస్‌ఐ చిప్‌ డిజైన్‌, వీఎల్‌ఎస్‌ఐ ఫిజికల్‌ డిజైన్‌ విత్‌ టైమింగ్‌ అనాలిసిస్‌, డిజైన్‌ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ వీఎల్‌ఎస్‌ఐ సబ్‌ సిస్టమ్స్‌, వీఎల్‌ఎస్‌ఐ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ లాంటి ఎన్‌పీటెల్‌ (నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌) కోర్సుల్లో చేరవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని