JEE Main 2024: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Updated : 22 Jan 2024 17:25 IST

JEE Main 2024 Admit Cards | ఇంటర్నెట్‌ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 పరీక్షలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసిన అధికారులు.. తాజాగా పేపర్‌-2 పరీక్షకు అడ్మిట్‌ కార్డుల్ని (JEE Main Admit Cards) విడుదల చేశారు. బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డుల్ని ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేయడం ద్వారా అడ్మిట్‌కార్డుల్ని పొందొచ్చు. పేపర్‌ -1కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. 

పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్‌ (JEE Main) తొలి విడత పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. గతేడాది కన్నా ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దేశంలో దాదాపు 12.30లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5లక్షల మందికి పైగా ఉన్నారు. దేశంలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు  జేఈఈ మెయిన్‌ ర్యాంకులనే ప్రామాణికంగా తీసుకుంటారు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని