TS TET: టెట్‌ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Updated : 14 Mar 2024 19:23 IST

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డీఎస్సీకి ముందే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్‌ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ జారీ చేయనుంది. వీలైనంత ఎక్కువ మందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ (TS DSC 2024) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని