క్రిస్మస్‌.. ముస్తాబు

సొగసు ప్రియులు తమ స్టైల్‌ ప్రదర్శించడానికి ఓ సందర్భం కోసం చూస్తుంటారు. ఆ ఔత్సాహికులకు అనువైన వేదిక, వేడుక క్రిస్మస్‌ వచ్చేస్తోంది. ఈ సమయంలో ఎలా ముస్తాబు....

Updated : 24 Nov 2022 15:17 IST

సొగసు ప్రియులు తమ స్టైల్‌ ప్రదర్శించడానికి ఓ సందర్భం కోసం చూస్తుంటారు. ఆ ఔత్సాహికులకు అనువైన వేదిక, వేడుక క్రిస్మస్‌ వచ్చేస్తోంది. ఈ సమయంలో ఎలా ముస్తాబు కావాలో తెలుసుకుందామా?

* క్రిస్మస్‌ అంటేనే గుర్తొచ్చేది ఎరుపు. టోపీ, శాంటా, చెర్రీస్‌, క్రిస్మస్‌ ట్రీ అలంకరణ, క్యాండీలు.. అన్నీ రెడ్‌నే. ఆ వేడుకకు తగ్గట్టే ఎరుపు రంగు దుస్తులు ఎంచుకుంటే సందర్భానుసారంగా ఉంటుంది.
* అమ్మాయిలైనా, అబ్బాయిలైనా రెడ్‌కి జతగా తెలుపు జీన్స్‌, టీస్‌, స్నీకర్లు జతగా వేసుకుంటే కాంబినేషన్‌ బాగుంటుంది.
* క్రిస్మస్‌ అంటేనే పార్టీ టైం. అమ్మాయిలకైతే కురచ చేతుల టీషర్టులు, జీన్స్‌, మోకాలు దాకా వచ్చే బూట్లు.. పార్టీవేర్‌ సంసిద్ధతను తెలియజేస్తాయి.
* హుషారైన కుర్రకారు ఈ సమయంలో ఆడిపాడతారు. దుస్తులు అందుకు అనుగుణంగా ఉండాలంటే ఒంటి మొత్తాన్ని కవర్‌ చేసే కోట్లు, భారీ నగలు కాకుండా తేలికైన ఆభరణాలు, ఔట్‌ఫిట్స్‌ మేలు.
* వేడుకలనే కాదు.. గిలిగింతలు పెట్టే చలినీ కవర్‌ చేయాలి. అందుకోసం నిట్టెడ్‌ స్వెటర్లు, కార్డిగన్‌, ష్రగ్‌లు, క్యాప్‌లు ధరిస్తే స్టైలిష్‌గా ఉంటారు.
* హుందాగా ఉండాలనుకునే అబ్బాయిలు ప్లెయిడ్‌ ప్యాంట్లు, ట్రౌజర్‌, బ్లేజర్‌, మెడలో టై ధరించి మెరిసిపోవచ్చు. మోడర్న్‌ కుర్రాళ్లు, స్టైల్‌కే పెద్దపీట వేసేవాళ్లు డార్క్‌వాష్‌ జీన్స్‌, కాలర్డ్‌ షర్ట్‌ వీటిపై లేయర్‌ స్వెటర్‌ వేయాలి. వైట్‌, పైన్‌ గ్రీన్‌, క్యాండీ రెడ్‌ రంగులు బాగుంటాయి.

- షణ్మిత గాయత్రి, ఫ్యాషన్‌ డిజైనర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని