నవ్వుల్.... నవ్వుల్ !

టీచర్‌: బాబూ కూర్చో.. ఏంటి అలానే నిల్చొని ఉన్నావ్‌..చంటి: లేదు టీచర్‌.. నేను వెళ్లిపోతా..! టీచర్‌: లాక్‌డౌన్‌ వల్ల దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడే బడులు ప్రారంభమయ్యాయి. ఇలా వచ్చావో లేదో.. అలా వెళ్లిపోతావా?

Updated : 18 Feb 2021 03:28 IST

మర్చిపోయా టీచర్‌

టీచర్‌: బాబూ కూర్చో.. ఏంటి అలానే నిల్చొని ఉన్నావ్‌..
చంటి: లేదు టీచర్‌.. నేను వెళ్లిపోతా..!

టీచర్‌: లాక్‌డౌన్‌ వల్ల దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడే బడులు ప్రారంభమయ్యాయి. ఇలా వచ్చావో లేదో.. అలా వెళ్లిపోతావా?
చంటి: సారీ టీచర్‌! నేను మరిచిపోయి ఈ స్కూలుకు వచ్చా.. నేను వెళ్లాల్సిన స్కూలు పక్క వీధిలో ఉంది!
ఇంతకీ ఏం చెప్పాలి?


అంకుల్‌: ఏమ్మా పింకీ బాగున్నావా..
పింకి: ఓ.. బాగున్నా అంకుల్‌.

అంకుల్‌: ఇంతకీ ఏం చదువుతున్నావ్‌?
పింకి: ఏమో అంకుల్‌.. లాక్‌డౌన్‌ కదా.. మరిచిపోయా! ఉండండి.. ఇప్పుడే అమ్మను అడిగి చెబుతాను.  

అంకుల్‌: ఆఁఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని