కాలం బలీయం!

రోజూ వేళకు నిద్ర పోవాలి. వేళకు లేవాలి. మన పెద్దవాళ్లు ఎప్పట్నుంచో చెబుతున్నదే. మనం వింటేగా? చాదస్తం కొద్దీ ఏదో ....

Published : 15 Oct 2019 00:23 IST

రోజూ వేళకు నిద్ర పోవాలి. వేళకు లేవాలి. మన పెద్దవాళ్లు ఎప్పట్నుంచో చెబుతున్నదే. మనం వింటేగా? చాదస్తం కొద్దీ ఏదో చెబుతుంటారులే అని కొట్టిపారేస్తుంటాం. నిజానికిది ఎంతో మంచి అలవాటని, దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయని పరిశోధకులు అధ్యయనాల సాక్షిగా చెబుతున్నారు. రోజూ ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి లేచేవారికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం ముప్పులు తక్కువని తేలింది మరి. సుమారు 2,300 మందిని ఆరేళ్ల పాటు పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని