చర్మానికి ‘జెల్లి’ రక్ష!

చలికాలం రాగానే చర్మం పొడిబారకుండా పెట్రోలియం జెల్లీ రాసుకోవటం మామూలే. ఇది చర్మ సౌందర్యానికే కాదు...

Published : 26 Nov 2019 00:11 IST

లికాలం రాగానే చర్మం పొడిబారకుండా పెట్రోలియం జెల్లీ రాసుకోవటం మామూలే. ఇది చర్మ సౌందర్యానికే కాదు, ఇతరత్రా సమస్యల ఉపశమనానికీ పనికి వస్తుంది. చర్మం పొడిగా ఉంటే పుండు మానటానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే తేమ తగ్గకుండా ఉంటే త్వరగా నయమైపోతుంది. ఇందుకు పెట్రోలియం జెల్లీ ఉపయోగ పడుతుంది. ఎరుపు, మంట తగ్గటానికి.. చీము పట్టకుండా ఉండటానికీ దోహదం చేస్తుంది. కొత్త చెప్పులు, బూట్లు వేసుకునే ముందు మడమలకు కాస్త జెల్లీ రాసుకొని చూడండి. ఇది చర్మం రాపిడికి గురికాకుండా చూస్తూ బొడిపె ఏర్పడకుండా కాపాడుతుంది. ఒకవేళ బుడిపె వచ్చినా నయం కావటానికి తోడ్పడుతుంది. డైపర్‌ వేసినప్పుడు కొందరు పిల్లలకు దద్దు వస్తుంది. దీని నివారణకూ పెట్రోలిజయం జెల్లీ ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి పరిమళాలు, నిల్వ పదార్థాలు ఉండవు. అందువల్ల పిల్లల చర్మానికి ఎలాంటి హాని చేయదు. ముక్కు కారటంతో బాధపడేవారు ముక్కు చివర కాస్త జెల్లీ రాసుకుంటే చర్మం మంట పుట్టటం తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని