మధ్యవయసు నిద్రలేమితో డిమెన్షియా!

జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, ప్రవర్తనలను దెబ్బతీసే డిమెన్షియా బారినపడ్డవారికి సరిగా నిద్ర పట్టకపోవటం తెలిసిందే. అయితే మధ్యవయసులో తగినంత నిద్ర పోకపోయినా డిమెన్షియా ముప్పు పెరగొచ్చు.

Published : 25 May 2021 00:10 IST

జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, ప్రవర్తనలను దెబ్బతీసే డిమెన్షియా బారినపడ్డవారికి సరిగా నిద్ర పట్టకపోవటం తెలిసిందే. అయితే మధ్యవయసులో తగినంత నిద్ర పోకపోయినా డిమెన్షియా ముప్పు పెరగొచ్చు. రాత్రిపూట 6-8 గంటల సేపు నిద్రపోయేవారితో పోలిస్తే- 5 గంటల కన్నా తక్కువసేపు నిద్రించేవారికి డిమెన్షియా ముప్పు రెండు రెట్లు పెరుగుతున్నట్టు హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు గుర్తించారు. మరణించే ముప్పూ రెండింతలు ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. యూరప్‌లో నిర్వహించిన మరో అధ్యయనమూ దీన్ని బలపరుస్తోంది. 50-70 ఏళ్ల వయసులో రోజుకు 6 గంటలు, అంతకన్నా తక్కువ నిద్రించేవారికి డిమెన్షియా ముప్పు 33% పెరుగుతున్నట్టు బయటపడింది. షిఫ్ట్‌ ఉద్యోగాలు, నిద్రలేమి, ఇంట్లో వాళ్ల బాగోగులు చూసుకోవటం, ఆందోళన, సరైన సమయానికి పనులు పూర్తిచేయాల్సి రావటం వంటి రకరకాల అంశాలు నిద్రను దెబ్బతీస్తుండొచ్చు. అన్నీ మన చేతుల్లో లేకపోవచ్చు గానీ కొన్నింటిని మార్చుకోవచ్చు. ఉదాహరణకు- రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని పనులు చేయటం మూలంగానే తక్కువ నిద్ర పోతుంటే తప్పకుండా మార్చుకోవచ్చు. పదవీ విరమణ సమయానికి డిమెన్షియా ముప్పునూ తగ్గించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని