పీచు ఎంత అవసరం?

పోషకాలు అనగానే విటమిన్లు, ఖనిజాల వంటివే గుర్తుకొస్తాయి గానీ పీచు గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికిది చాలా ముఖ్యం.

Published : 24 Aug 2021 01:02 IST

పోషకాలు అనగానే విటమిన్లు, ఖనిజాల వంటివే గుర్తుకొస్తాయి గానీ పీచు గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికిది చాలా ముఖ్యం. జీర్ణకోశ వ్యవస్థ సజావుగా పనిచేయటానికి  పీచు తోడ్పడుతుంది. బరువు తగ్గటానికి, పేగుల్లో బ్యాక్టీరియా సమతులంగా ఉండటానికీ దోహదం చేస్తుంది. మన ఆహారంలో నీటిలో కరిగే పీచు, కరగని పీచు రెండూ ఉంటాయి. కరిగే పీచు ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తూ రక్తంలో గ్లూకోజు మోతాదులు వెంటనే పెరగకుండా చూస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కరగని పీచు నీటిని పీల్చుకుంటుంది. మల బద్ధకాన్ని నివారిస్తుంది. మగవారికి రోజుకు 38 గ్రాములు, ఆడవారికి 25 గ్రాముల పీచు అవసరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని