పార్శ్వనొప్పికి యోగా చికిత్స

పార్శ్వనొప్పితో బాధపడుతున్నారా? అయితే యోగాసనాలు సాధన చేసి చూడండి. ముఖ్యంగా తల కిందికి వంచి చేసే ఆసనాలు, సూర్య నమస్కారాలు వేయండి. పార్శ్వనొప్పి మందులు వేసుకున్నవారితో పోలిస్తే.. మందులతో పాటు యోగా...

Published : 02 Nov 2021 02:23 IST

పార్శ్వనొప్పితో బాధపడుతున్నారా? అయితే యోగాసనాలు సాధన చేసి చూడండి. ముఖ్యంగా తల కిందికి వంచి చేసే ఆసనాలు, సూర్య నమస్కారాలు వేయండి. పార్శ్వనొప్పి మందులు వేసుకున్నవారితో పోలిస్తే.. మందులతో పాటు యోగా కూడా సాధన చేసినవారిలో పార్శ్వనొప్పి లక్షణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్టు బయటపడింది. వీరిలో అంతకుముందు కన్నా తలనొప్పులు దాదాపు సగానికి పడిపోవటం గమనార్హం. ఒకవేళ తలనొప్పి వచ్చినా అంత తీవ్రంగా ఉండటం లేదు. తక్కువ సేపే ఉంటున్నాయి. మందుల అవసరమూ తగ్గుతోంది. పార్శ్వనొప్పి దీర్ఘకాలం వేధించే సమస్య. దీంతో తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతితో పాటు వెలుతురు, చప్పుడు భరించలేకపోవటం వంటి ఇబ్బందులెన్నో తలెత్తుతుంటాయి. పార్శ్వనొప్పి ప్రేరేపితం కావటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. వీటిల్లో ఒత్తిడి ఒకటి. ఇది తగ్గితే పార్శ్వనొప్పీ తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక్కడే యోగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఆసనాలు, గాఢంగా శ్వాస తీసుకోవటం, ధ్యానం వంటివి ఒత్తిడి తగ్గటానికి తోడ్పడతాయి. అందుకే పార్శ్వనొప్పి చికిత్సలో ఇవి ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. యోగాతో రక్తపోటు, గుండె వేగమూ తగ్గుతాయి. దీంతో పార్శ్వనొప్పి మూలంగా పడిన ఒత్తిడి నుంచి శరీరం త్వరగా కోలుకోవటమూ సాధ్యమవుతుంది. నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకొని యోగాను ఆచరిస్తే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని