ఏడు గంటల నిద్ర ఉత్తమం!

నిద్ర తగ్గితేనే కాదు, ఎక్కువైనా ఇబ్బందే. మరి ఎంతసేపు నిద్రపోవాలి? దీన్ని గుర్తించటానికి బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి, చైనాలోని ఫ్యూడన్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఓ భారీ అధ్యయనం నిర్వహించారు. ఇందులో

Updated : 03 May 2022 06:36 IST

నిద్ర తగ్గితేనే కాదు, ఎక్కువైనా ఇబ్బందే. మరి ఎంతసేపు నిద్రపోవాలి? దీన్ని గుర్తించటానికి బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి, చైనాలోని ఫ్యూడన్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఓ భారీ అధ్యయనం నిర్వహించారు. ఇందులో సుమారు 5లక్షల మందిని పరిశీలించారు. మధ్యవయసు వారికి, అంతకన్నా ఎక్కువ వయసు గలవారికి రోజుకు 7 గంటల నిద్ర ఉత్తమమని తేల్చారు. అంతకన్నా తక్కువగా లేదా ఎక్కువగా నిద్రపోయేవారిలో విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతున్నట్టు గుర్తించారు. అంటే విషయాలను అర్థం చేసుకోవటం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు తగ్గుతున్నాయన్నమాట. అంతేకాదు.. వీరిలో ఆందోళన, కుంగుబాటు లక్షణాలు మరింత ఎక్కువగా ఉండటమూ గమనార్హం. విషయగ్రహణ సామర్థ్యం, మానసిక ఆరోగ్యంలో నిద్ర పాత్ర కీలకం. ఇది వ్యర్థ పదార్థాలను తొలగించటం ద్వారా మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. వయసు మీద పడుతున్నకొద్దీ నిద్ర తీరుతెన్నులు మారుతుంటాయి. నిద్ర పట్టకపోవటం, మధ్యలో మెలకువ రావటం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవి వృద్ధాప్యంలో మతిమరుపు, మానసిక సమస్యల వంటి వాటికి దారితీస్తుంటాయని భావిస్తుంటారు. తగినంత నిద్రపోతే వీటి బారినపడకుండా చూసుకోవచ్చని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని