‘సంతాన’ భద్రాసనం!

సంతాన అవయవాల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే భద్రాసనాన్ని సాధన చేయండి. ఇది మూత్ర, సంతాన అవయవాలకు ఆక్సిజన్‌తో నిండిన రక్తం...

Updated : 13 Aug 2019 02:37 IST

సంతాన అవయవాల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే భద్రాసనాన్ని సాధన చేయండి. ఇది మూత్ర, సంతాన అవయవాలకు ఆక్సిజన్‌తో నిండిన రక్తం బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది. ఆ భాగంలోని కండరాలను, కండర బంధనాలను వదులుగానూ చేస్తుంది.

ఎలా చెయ్యాలి?

చాప మీద కూర్చొని, కాళ్లు తిన్నగా చాచాలి. 
రెండు పాదాల మడమలను తాకించి.. వాటిని నెమ్మదిగా గజ్జల దగ్గరికి తీసుకురావాలి. 
అర చేతులను మోకాళ్ల మీద పెట్టి కిందికి నెట్టాలి. మోకాళ్లు నేలకు తాకేలా చూసుకోవాలి. 
కళ్లు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. 
కొద్దిసేపయ్యాక కాళ్లను తిన్నగా చాచి, విశ్రాంతి తీసుకోవాలి. 
ఆసనం వేసేటప్పుడు మనసును మలద్వారం, జననాంగాల మధ్య (మూలాధారం) కేంద్రీకరించాలి.

ప్రయోజనాలేంటి?

తొడలు, మోకాళ్లు, పిక్కలకు కొత్త శక్తి వస్తుంది. 
కటిభాగంలోని కండరాలు, కండర బంధనాలు వదులవుతాయి. 
మానసిక ప్రశాంతత, భద్రత చేకూరుతుంది. 
సయాటికా, సిరల ఉబ్బు, నెలసరి సమస్యల బాధలు తగ్గుతాయి. 
శరీర భంగిమ, ఏకాగ్రత మెరుగవుతాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని