కుంగుబాటుకు అక్రోటు మందు!

కుంగుబాటు బారినపడకూడదని అనుకుంటున్నారా? ఏకాగ్రత పెంచుకోవాలని భావిస్తున్నారా? అయితే అక్రోట్లు (వాల్‌నట్స్‌) తిని చూడండి. గింజపప్పులు (నట్స్‌) అసలే తిననివారితో పోలిస్తే..

Published : 12 Feb 2019 00:16 IST

కుంగుబాటు బారినపడకూడదని అనుకుంటున్నారా? ఏకాగ్రత పెంచుకోవాలని భావిస్తున్నారా? అయితే అక్రోట్లు (వాల్‌నట్స్‌) తిని చూడండి. గింజపప్పులు (నట్స్‌) అసలే తిననివారితో పోలిస్తే.. వీటిని తీసుకునేవారికి కుంగుబాటు ముప్పు 8% తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ఎంజెలిస్‌ పరిశోధకులు గుర్తించారు. అదే అక్రోట్లు తీసుకునేవారికైతే 26% వరకు ముప్పు తక్కువగా ఉంటుండటం విశేషం. వీటితో శక్తి పుంజుకోవటంతో పాటు ఏకాగ్రత, ఆశావహ దృక్పథం కూడా బాగా మెరుగవుతున్నట్టూ తేలింది. వాల్‌నట్స్‌లో ప్రత్యేకమైన కొవ్వు ఆమ్లాలు.. ముఖ్యంగా ఒమేగా 3 అల్ఫా లినోలిక్‌ ఆమ్లం దండిగా ఉంటుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెకు, మెదడుకు మేలు చేస్తాయన్నది తెలిసిందే. ఇవి కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పట్టటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా తేలటం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని