అవయవాల శక్తిపై కరోనా దెబ్బ

మన ఒంట్లో ప్రతి కణానికీ శక్తి అవసరం. అప్పుడే అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌2 ఇక్కడే దెబ్బకొడుతోంది. గుండె, కిడ్నీలు, ప్లీహం వంటి అవయవాల్లోని కణాలు శక్తిని తయారుచేసుకునే ప్రక్రియను నిలువరిస్తోంది. దీంతో అవయవాలు చతికిలపడిపోతున్నాయి.

Published : 15 Dec 2020 01:05 IST

న ఒంట్లో ప్రతి కణానికీ శక్తి అవసరం. అప్పుడే అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌2 ఇక్కడే దెబ్బకొడుతోంది. గుండె, కిడ్నీలు, ప్లీహం వంటి అవయవాల్లోని కణాలు శక్తిని తయారుచేసుకునే ప్రక్రియను నిలువరిస్తోంది. దీంతో అవయవాలు చతికిలపడిపోతున్నాయి. తీవ్ర కొవిడ్‌-19లో అవయవాలు విఫలం కావటానికి ఇదే కారణమవుతోందని యూసీఎల్‌ఏ అధ్యయనం పేర్కొంటోంది. దీన్ని గుర్తించటానికి శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యేలా ఎలుకలను మార్చేటం విశేషం. దీంతో మన కణాలను వైరస్‌ ఎలా దారి మళ్లిస్తోందనేది అర్థం చేసుకోవటం సాధ్యమైంది. కరోనా బాధితుల్లో అవయవాల వైఫల్యాన్ని నివారించటానికి కొత్త చికిత్సలను రూపకల్పనకిది ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు. ఎలుకల్లోని ఏస్‌2 గ్రాహకాన్ని కరోనా వైరస్‌ గుర్తించలేదు. దీంతో వైరస్‌ ప్రభావానికి గురిచేసినా వాటికి ఇన్‌ఫెక్షన్‌ రాదు. అందుకే ఎలుకల అవయవాల్లోని జన్యువులను కరోనా జబ్బు సోకేలా మార్చి, అధ్యయనం చేశారు. ఇవన్నీ ఏడు రోజుల్లోనే తిండి తినటం మానేశాయి. పూర్తిగా చతికిల పడిపోయాయి. సగటున 20% మేరకు బరువు తగ్గాయి. ఇవన్నీ కణాల్లో శక్తి ప్రక్రియ నిలిచిపోయిందనటానికి సూచికలే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని