రాత్రి చెమటలతో ఒత్తిడి!

ముట్లుడిగే (మెనోపాజ్‌) సమయంలో మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది వేడి ఆవిర్లు, రాత్రిపూట విపరీతమైన చెమట పట్టటం. చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావమే చూపుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ తాజా అధ్యయనంలో బయటపడింది.

Published : 18 Oct 2022 01:04 IST

ముట్లుడిగే (మెనోపాజ్‌) సమయంలో మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది వేడి ఆవిర్లు, రాత్రిపూట విపరీతమైన చెమట పట్టటం. చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావమే చూపుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ తాజా అధ్యయనంలో బయటపడింది. ముఖ్యంగా ఆవిర్ల కన్నా రాత్రి చెమటలు మరింత ఎక్కువ నష్టం కలిగిస్తుండటం గమనార్హం. వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు.. ఒకేలా కనిపించినప్పటికీ రెండూ వేర్వేరు సమస్యలు. వేడి ఆవిర్లు రాత్రి, పగలు ఎప్పుడైనా రావొచ్చు. ఈ సమయంలో చెమట పట్టచ్చు, పట్టకపోవచ్చు. ఇక చెమట విషయానికి వస్తే రాత్రిపూటే విపరీతంగా ఉక్క పోస్తుంటుంది. వేడి ఆవిర్లతో కొందరు కుంగుబాటుకు లోనవుతుంటే.. రాత్రి చెమటలతో కుంగుబాటుతో పాటు మానసిక ఒత్తిడీ తలెత్తుతున్నట్టు బయటపడింది. పగటిపూట వేడి ఆవిర్లు వచ్చే మహిళలతో పోలిస్తే రాత్రిపూట ఇవి వచ్చేవారిలో కుంగుబాటు మరింత ఎక్కువగా ఉంటున్నట్టూ తేలింది. ఇవి రెండూ మహిళల రోజువారీ జీవితాన్ని గణనీయంగా దెబ్బతీస్తున్నాయని, అందువల్ల వీటిని తేలికగా తీసుకోవటానికి లేదని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని