గుండెలయ తప్పితే మతిమరుపు ముప్పు

గుండె కొట్టుకునే వేగం క్రమం తప్పటం (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) పెద్ద సమస్య. ఇది గుండెలో రక్తం గడ్డలు ఏర్పడేలా చేయొచ్చు. ఇవి మెదడు రక్తనాళాల్లోకి చేరుకొని రక్త ప్రసరణకు అడ్డు తగలొచ్చు.

Published : 21 Mar 2023 00:40 IST

గుండె కొట్టుకునే వేగం క్రమం తప్పటం (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) పెద్ద సమస్య. ఇది గుండెలో రక్తం గడ్డలు ఏర్పడేలా చేయొచ్చు. ఇవి మెదడు రక్తనాళాల్లోకి చేరుకొని రక్త ప్రసరణకు అడ్డు తగలొచ్చు. ఫలితంగా పక్షవాతం సంభవిస్తుంది. గుండె వైఫల్యం ముప్పూ పెరుగుతుంది. ఆయుష్షు కూడా తగ్గుతుంది. అంతేకాదు.. మతిమరుపు (డిమెన్షియా) వచ్చే అవకాశమూ ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పెద్దఎత్తున నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. సుమారు రెండు లక్షల మంది రోగుల వివరాలను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. ఇటీవలి కాలంలో గుండె లయ తప్పినవారికి మతిమరుపు వచ్చే అవకాశం 13% అధికంగా ఉంటున్నట్టు తేలింది. ఇక 65 ఏళ్ల కన్నా ముందే ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ బారినపడ్డవారికైతే దీని ముప్పు 65% ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. అందువల్ల గుండె లయ తప్పటాన్ని తేలికగా తీసుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని