Published : 14 Dec 2021 00:36 IST

గ్రంథుల ఆరోగ్యానికిహలాసనం

థైరాయిడ్‌, పారాథైరాయిడ్‌, పిట్యుటరీ గ్రంథుల పనితీరు మెరుగుపరచుకోవాలని అనుకునేవారికి హలాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని వేసినప్పుడు శరీరం నాగలి మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి హలాసనం అని పేరు. ఇది కాస్త కష్టమైన ఆసనం. వెన్నెముక మృదువుగా ఉండేలా చూసుకున్నాకే దీన్ని సాధన చేయటం మంచిది.

ఎలా వేయాలి?
* వెల్లకిలా పడుకొని, చేతులను తిన్నగా చాపి, అరచేతులను నేలకు తాకించి ఉంచాలి.
* కాళ్లను పైకి లేపి, మడమలను పిరుదులకు తాకించాలి. మోకాళ్లను పొట్ట వద్దకు తేవాలి.
* శ్వాసను వదులుతూ ఒక్క ఉదుటున కాళ్లను పైకి లేపాలి. నెమ్మదిగా పాదాలను తల వెనక వైపునకు తేవాలి. కాలి వేళ్లను నేలకు తాకించాలి. అరచేతులతో నేలను బలంగా నొక్కుతూ స్థిరంగా ఉండాలి. చూపును నాభి మీద కేంద్రీకరించాలి. మెడను వంచ కూడదు. శ్వాస మామూలుగా తీసుకోవాలి. రెండు నిమిషాలు అలాగే ఉండి, మునుపటి స్థితికి రావాలి.

ప్రయోజనాలేంటి?
* అన్ని గ్రంథులకు చైతన్యం కలిగిస్తుంది. మధుమేహులకు మేలు చేస్తుంది. వెన్నెముక, పిరుదులు, నడుమును బలోపేతం చేస్తుంది. జీర్ణకోశం పుంజుకుంటుంది. జననాంగాలకు మర్దన లభిస్తుంది.

 


వీరికి కూడదు
అధిక రక్తపోటు, గుండెజబ్బులు, చెవిలో చీము, జలుబు, మెడనొప్పి ఉన్నవారు.. గర్భిణులు ఈ ఆసనం వేయకూడదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు