ఆస్థమాకు క్యాండిల్ ‘పొగ’
మూడ్‌ను ఉత్తేజితం చేయటానికో, రోజంతా పడ్డ శ్రమ నుంచి విశ్రాంతి పొందటానికో ఇంట్లో పరిమళ క్యాండిల్స్ వెలిగించటం ఇటీవల ఎక్కువైంది
మూడ్‌ను ఉత్తేజితం చేయటానికో, రోజంతా పడ్డ శ్రమ నుంచి విశ్రాంతి పొందటానికో ఇంట్లో పరిమళ క్యాండిల్స్ వెలిగించటం ఇటీవల ఎక్కువైంది. అయితే వీటిని వెలిగించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు కోవటం మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఆస్థమాతో బాధపడే వారుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. క్యాండిల్స్ వెలిగించినప్పుడు, వంట వండేటప్పుడు వెలువడే పొగలతో కలుషితమయ్యే గాలి మూలంగా ఆస్థమా బాధితుల్లో చిరాకు, వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతున్నట్టు ఆర్హస్ యూనివర్సిటీ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. రక్తంలో వాపు ప్రక్రియ ఆనవాళ్లతో పాటు డీఎన్‌ఏ దెబ్బతింటున్న సంకేతాలూ బయటపడటం గమనార్హం. సాధారణంగా స్టవ్ మీద వండుతున్నప్పుడు, క్యాండిల్స్ వెలిగించినప్పుడు అతి సూక్ష్మ రేణువులు, వాయువులు వెలువడతాయి. ఇవి ఇంట్లోనే తిరుగాడుతూ శ్వాస ద్వారా శరీరంలోకీ ప్రవేశించొచ్చు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటున్నట్టు గత అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో పరిశోధకులు స్వల్ప ఆస్థమా గల 18-25 ఏళ్ల వారిపై ఇటీవల అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా ఈ వయసువారు ఫిట్‌గా ఉంటారు. పెద్ద వయసువారితో పోలిస్తే ప్రతికూల ప్రభావాలను బాగా తట్టుకుంటారు. కానీ వంట వండుతున్నప్పుడు, క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఇంట్లో గాలి ధారాళంగా ఆడకపోతే స్వల్ప ఆస్థమాతో బాధపడే యువత మీదా విపరీత ప్రభావం పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఇంట్లో గాలి కలుషితం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. తలుపులు, కిటికీలు తెరచి ఉంచటం మంచిది. ఇది ఆస్థమా తగ్గటానికే కాదు.. గుండె, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్ల ముప్పులు తగ్గటానికీ తోడ్పడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
-
Eluru: యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
Art of living: గురుదేవ్ లేకుంటే మా దేశంలో శాంతి అసాధ్యం: కొలంబియా ఎంపీ
-
యువకుడి కడుపులో గర్భాశయం.. కంగుతిన్న వైద్యులు