పిల్లల కంటికి పొగ

సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగటం మానలేకపోతున్నారా? కనీసం ఇంట్లోనైనా కాల్చకుండా చూసుకోండి. మీ కోసం కాకపోయినా మీ పిల్లల కోసమైనా దీన్ని పాటించండి. సిగరెట్లు, బీడీలు తాగేవారు వదిలిన పొగ పిల్లల కంటికి

Published : 09 Mar 2021 02:16 IST

సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగటం మానలేకపోతున్నారా? కనీసం ఇంట్లోనైనా కాల్చకుండా చూసుకోండి. మీ కోసం కాకపోయినా మీ పిల్లల కోసమైనా దీన్ని పాటించండి. సిగరెట్లు, బీడీలు తాగేవారు వదిలిన పొగ పిల్లల కంటికి హాని చేస్తున్నట్టు హాంకాంగ్‌లో నిర్వహించిన అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇతరులు వదిలిన పొగ ప్రభావానికి గురవటం వల్ల పిల్లల కంట్లో ఎరుపు పొర (కోరాయిడ్‌) పలుచగా అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. రెటీనాకు తెల్లగుడ్డకు మధ్య ఉండే ఈ పొర రక్తనాళాలలో కూడుకొని ఉంటుంది. ఇది రెటీనా వెలుపలి భాగానికి పోషకాలు, ఆక్సిజన్‌ అందటంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే కోరాయిడ్‌ మందం ఆధారంగా కంటి ఆరోగ్యాన్నీ అంచనా వేస్తారు. ఇంట్లో పొగతాగేవారు ఎక్కువగా ఉన్నా లేదా కుటుంబ సభ్యులు ఎక్కువసార్లు పొగతాగుతున్నా పిల్లల కంట్లో కోరాయిడ్‌ పొర మందం పలుచబడిపోయే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని