మెదడును ఏమార్చి..

కొన్నిసార్లు సమస్య ఏమీ ఉండదు. కానీ నొప్పి విడవకుండా వేధిస్తుంటుంది. దీనికి కారణం మెదడులో తలెత్తే మార్పులు. దీంతో గాయం మానినా నొప్పి భావన పుడుతూనే ఉంటుంది. ఫలితంగా కదలికలు తగ్గిపోతాయి.

Published : 22 Feb 2022 00:54 IST

కొన్నిసార్లు సమస్య ఏమీ ఉండదు. కానీ నొప్పి విడవకుండా వేధిస్తుంటుంది. దీనికి కారణం మెదడులో తలెత్తే మార్పులు. దీంతో గాయం మానినా నొప్పి భావన పుడుతూనే ఉంటుంది. ఫలితంగా కదలికలు తగ్గిపోతాయి. మరి మెదడును ఏమార్చితే నొప్పి తగ్గుతుందా? అవుననే అంటున్నారు పరిశోధకులు. ఇందుకోసం పెయిన్‌ రీప్రాసెసింగ్‌ థెరపీ (పీఆర్‌టీ) చికిత్సను రూపొందించారు. నొప్పిని గుర్తించకుండా మెదడుకు శిక్షణ ఇవ్వటం దీని ఉద్దేశం. దీనిపై ఇటీవలే తొలి ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. శారీరకంగా ఎలాంటి సమస్య లేకపోయినా దీర్ఘకాలంగా ఒక మాదిరిగా, మధ్యస్థంగా నడుం నొప్పితో బాధపడేవారికి నాలుగు వారాల పాటు చికిత్స చేశారు. దీంతో 66% మందికి నడుం నొప్పి దాదాపు పూర్తిగా తగ్గిపోవటం విశేషం. వీరి మెదడును స్కాన్‌ చేయగా నొప్పితో ముడిపడిన భాగంలో చురుకుదనం తగ్గినట్టూ బయటపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని