గుండెకే కాదు మెదడుకూ..

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నట్టే. గుండె ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలతో మెదడు సైతం చురుగ్గా పనిచేస్తున్నట్టు..

Updated : 08 Dec 2022 19:50 IST

గుండెకే కాదు మెదడుకూ..

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నట్టే. గుండె ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలతో మెదడు సైతం చురుగ్గా పనిచేస్తున్నట్టు.. దీంతో డిమెన్షియా, విషయగ్రహణ లోపం ముప్పులు తగ్గుతున్నట్టు తాజాగా బయటపడింది మరి. పొగ తాగకపోవటం, బరువు అదుపులో ఉంచుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం.. చేపలు, పండ్లు, కూరగాయలు అధికంగా గల ఆహారం తీసుకోవటం.. రక్తపోటు, రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ స్థాయుల నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చన్నది నిపుణుల సూచన. వీటిల్లో ఒకో జాగ్రత్తతో డిమెన్షియా ముప్పు 10% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అన్ని జాగ్రత్తలను పాటించేవారిలోనైతే ఏకంగా 70% వరకు డిమెన్షియా ముప్పు తగ్గుతుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని