Pollution-Eczema : కాలుష్యంతో గజ్జి
వాహనాలు, కార్చిచ్చులు, సిగరెట్ల నుంచి వెలువడే పొగ చర్మానికి హాని కలిగిస్తున్నట్టు, ఆరోగ్యకరమైన నూనెను విడుదల చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది.
వాహనాలు, కార్చిచ్చులు, సిగరెట్ల నుంచి వెలువడే పొగ చర్మానికి హాని కలిగిస్తున్నట్టు, ఆరోగ్యకరమైన నూనెను విడుదల చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. దీంతో ఎండుగజ్జి (ఎగ్జిమా) ముప్పు పెరిగే అవకాశమున్నట్టు వెల్లడైంది. ఎగ్జిమాకు మరింత మెరుగైన చికిత్సకు అధ్యయన ఫలితాలు తోడ్పగలవని భావిస్తున్నారు. 70లతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎండుగజ్జి సమస్య మూడు రెట్లు ఎక్కువైంది. సుమారు 20% మంది పిల్లలు, 10% మంది పెద్దవాళ్లు దీంతో సతమతమవుతున్నారు. మన వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాల మూలంగా రోజురోజుకీ అలర్జీ సమస్యలు ఎక్కువవుతున్నాయనే విషయాన్ని అధ్యయనం నొక్కి చెబుతోంది. ఎండుగజ్జి ఎందుకు పెరిగిపోతోందో అర్థం చేసుకోవటానికిది తోడ్పడగలదని పరిశీలకులు భావిస్తున్నారు. కొందరికి జన్యుపరమైన అంశాలతో ఎగ్జిమా వస్తుంటుంది. డైసోసయనేట్స్ అనే రసాయనాలతోనూ దీని లక్షణాలు ప్రేరేపితం కావొచ్చని.. దురద, చర్మం ఎరుపు, రసి కారటం వంటివి తలెత్తుతున్నట్టు గత పరిశోధనల్లో వెల్లడైంది. దీని ఆధారంగానే తాజా అధ్యయనం నిర్వహించారు. డైసోసయనేట్లలో భాగమైన ఐసోసయోనేట్స్‌తో ఎలుకల చర్మంలో నూనె ఉత్పత్తి అస్తవ్యస్తమైనట్టు గుర్తించారు. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఈ నూనె అత్యవసరం. ఐసోసయోనేట్స్ ప్రభావానికి గురైనప్పుడు చర్మం మీదుండే బ్యాక్టీరియా జీవక్రియలు మారిపోతున్నాయని, అప్పుడవి నూనెలను ఉత్పత్తి చేయటం మానేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దెబ్బతిన్న బ్యాక్టీరియా స్థానంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను మార్పిడి చేస్తే ఎండుగజ్జిని నయం చేయొచ్చని ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో