చిత్ర విచిత్రాల నక్షత్ర కోట

అనగనగా ఒక కోట... అదీ సాదాసీదా కోట కాదు... చిత్రమైన నక్షత్ర కోట... పైనుంచి చూస్తే అచ్చం స్టార్‌ ఆకారంలో కనిపిస్తుందిది... ఇంకా ఇక్కడ ఏమేం వింతలున్నాయో తెలుసుకోవాలనుందా? ఇంకెందుకాలస్యం చదివేయండి మరి...

Published : 20 Feb 2020 01:05 IST

అనగనగా ఒక కోట... అదీ సాదాసీదా కోట కాదు... చిత్రమైన నక్షత్ర కోట... పైనుంచి చూస్తే అచ్చం స్టార్‌ ఆకారంలో కనిపిస్తుందిది... ఇంకా ఇక్కడ ఏమేం వింతలున్నాయో తెలుసుకోవాలనుందా? ఇంకెందుకాలస్యం చదివేయండి మరి...

నక్షత్ర కోట.. ఆకారాన్ని బట్టి దీన్ని ఇలా అంటారు కానీ.. నిజానికి దీని పేరు మంజ్రాబాద్‌ కోట.

* మైసూర్‌ పాలకుడు టిప్పుసుల్తాన్‌ 1792లో దీన్ని నిర్మించాడు.
* ఇది కర్ణాటక రాష్ట్రం హస్సన్‌ జిల్లాలో ఉంది.
* ఈ కోట సక్లెస్‌పురకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
* 3,241 అడుగుల ఎత్తైన కొండమీద నక్షత్ర కోటను కట్టారు.
* దీని మీద నుంచి చూస్తే చుట్టు పక్కల ప్రాంతాలన్నీ చక్కగా కనిపిస్తాయి.
*మేఘాలు లేకుండా ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు కోటపై నుంచి చూస్తే ఏకంగా అరేబియా సముద్రం కనిపిస్తుందట!
అచ్చం తారలా...
* ఈ కోట పై నుంచి చూస్తే అచ్చం నక్షత్రంలానే కనిపిస్తుంది.
* ఫ్రెంచ్‌ ఇంజినీర్లు యురోపియన్‌ శైలిలోదీన్ని నిర్మించారు.
 
* కోటగోడను గ్రానైట్‌ రాయితో దృఢంగా కట్టారు.
* లోపల ఉన్ననిర్మాణాలకు ప్రత్యేకమైన సున్నాన్ని వాడారు. కొన్నిచోట్ల కాల్చిన మట్టి ఇటుకలనూ ఉపయోగించారు.


కోటకు బావి ‘ప్లస్‌’

* ముచ్చెమటలు పట్టించే మండు వేసవిలోనూ ఈ కోటలోని గదులు చాలా చల్లగా ఉంటాయి.
* గోడలు మాములుగా కాకుండా కాస్త వాలుగా నిర్మించారు.
* నక్షత్ర ఆకారంలో కోట ఉండటం ఓ వింతైతే.. కోట మధ్యలో సరిగ్గా ప్లస్‌ ఆకారంలో ఓ బావి ఉండటం మరో విచిత్రం!
* దీనికి నాలుగు వైపులా మెట్లవంటి నిర్మాణాలున్నాయి.
* వేల అడుగుల ఎత్తున్న కొండపై ఉన్న ఈ బావిలో ఇప్పటికీ నీళ్లుండటం మరో వింత.  


 ఫ్రెంచ్‌ ఇంజినీర్ల ప్రతిభ  

*కోటను కట్టించింది టిప్పుసుల్తాన్‌ అయినప్పటికీ.. కట్టింది మాత్రం ఫ్రెంచ్‌ ఇంజినీర్లు.
 
* ఆ సమయంలో మరాఠాలు, హైదరాబాద్‌ నిజాంలు బ్రిటీష్‌ వారితో కలిసిపోయారు.
* తన చుట్టుపక్కల రాజ్యాల వారు బ్రిటీష్‌ పాలకులతో చేతులు కలపడంతో.. టిప్పుసుల్తాన్‌ తన రాజ్య రక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* అందుకే తన సార్వభౌమత్వాన్ని చాటుకోవడం కోసం ఈ కోట నిర్మించాలనుకున్నాడు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని