ఎంచక్కా.. నలుగురు మిత్రులు!
ఒక మేక, గాడిద, ఎద్దు మంచి స్నేహితులు. ఈ మూడూ ఒకదానికి మరోటి సహాయం చేసుకుంటూ, చక్కగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి.
ఒక మేక, గాడిద, ఎద్దు మంచి స్నేహితులు. ఈ మూడూ ఒకదానికి మరోటి సహాయం చేసుకుంటూ, చక్కగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. చాలాకాలంగా వీటి స్నేహాన్ని ఒక కుందేలు గమనిస్తోంది. కుందేలుకు స్నేహితులు లేరు. దానికి వాటితో స్నేహం చేయాలనిపించింది.
కానీ తనతో స్నేహం చేయమని వాటిని అడగడానికి భయపడింది. ‘నేను చాలా చిన్న జీవిని, అవేమో పెద్దవి. వాటికి నా కన్నా బలం ఎక్కువ. నాతో స్నేహం చేయడానికి అవి ఇష్టపడవు’ అని మనసులో అనుకుంది కుందేలు. రోజూ పొదల మాటు నుంచే.. అవి ఆహారం కోసం కలిసి బయటకు వెళ్లడం, తిరిగి రావడం చూసేది. ఇలా కుందేలు ఒంటరిగా పొదల మాటున ఉండటాన్ని ఒకరోజు జిత్తులమారి నక్క చూసింది. ‘భలే భలే..! ఎలాగైనా ఈ రోజు రుచికరమైన కుందేలు మాంసం తినాలి’ అనుకుంటూ దాన్ని పట్టుకునేందుకు వెనకగా వెళ్లింది. నక్క అడుగుల శబ్దం విన్న కుందేలు వెనక్కు తిరిగి చూసింది.
‘బాబోయ్... నక్క!’ అంటూ పరుగు పెట్టింది కుందేలు. ఎదురుగా పచ్చగడ్డి తింటున్న మేక కనిపించింది. ‘మేక అన్నయ్యా! మేక అన్నయ్యా...! నన్ను నక్క తరుముతోంది. కాపాడవా?’ అని ప్రాధేయపడింది.
‘అయ్యో... అది జిత్తులమారి నక్క కదా.. ఇద్దరం కలిసి పరిగెత్తుదాం పద’ అంటూ.. కొంచెం ముందు మేస్తున్న గాడిద దగ్గరకు వెళ్లి ఆగాయి.
‘నేస్తమా! ఈ చిన్ని కుందేలును పట్టుకునేందుకు నక్క వస్తోంది. మనం దీన్ని ఎలాగైనా కాపాడాలి’ అంది మేక. ‘అమ్మో! ఆ నక్క సామాన్యమైంది కాదు. మనం మన ఎద్దు నేస్తం దగ్గరకు వెళ్దాం పదండి’ అంటూ కుందేలును వీపు మీద ఎక్కించుకుని పరుగు తీసింది గాడిద.
మూడూ కలిసి సెలయేరులో నీరు తాగుతున్న.. ఎద్దు దగ్గరకు వెళ్లి సమస్యను వివరించాయి. అంతా విన్న ఎద్దుకు నక్క మీద పీకల దాకా కోపం వచ్చింది. పెద్దగా రంకె వేసి అక్కడకు వచ్చిన నక్కను కొమ్ములతో ఒక్క పోటు పొడిచింది. ‘కుందేలు మాంసం కోసం నేను వస్తే.. ఇవన్నీ కలిసి నా పని పట్టేలా ఉన్నాయి దేవుడా!’ అంటూ అక్కడి నుంచి పరుగు తీసింది నక్క.
అది చూసి గాడిద వీపు మీద కూర్చున్న చిన్ని కుందేలు కిలకిలా నవ్వింది. ‘స్నేహితులంటే మీ ముగ్గురిలా ఉండాలి. ఎన్నాళ్ల నుంచో మీ స్నేహం చూసి ముచ్చటపడుతున్నాను. కానీ నేను చిన్న ప్రాణిని కదా! నాతో స్నేహం మీకు నచ్చదేమోనని అడగటానికి మొహమాటం వేసింది. ఇప్పుడు అనుకోకుండా మీరే నన్ను కాపాడారు. ఇక ముందు కూడా నాతో కలిసి ఉంటారా నేస్తాలు?’ అంది కుందేలు.
‘అయ్యో! భలే దానివి కుందేలు. స్నేహమంటే మనసులు కలవడం, ఒకరికి మరొకరు అండగా నిలబడటం.. అంతే కానీ పెద్ద, చిన్న తేడా కాదు’ అంది మేక. ‘అవును... అంతే! ఇక నుంచి మేం ముగ్గురం కాదు. నీతో కలిసి నలుగురం. మనమంతా ఒకటిగా ఉందాం’ అంది గాడిద. తన కోరిక తీరినందుకు ఆనందంతో గాడిద మీద నుంచి ఎద్దు మీదకు చెంగున దూకింది కుందేలు.
కేవీ సుమలత
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nimmagadda: నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.. గవర్నర్‌కు నిమ్మగడ్డ వినతి
-
Elon Musk: మస్క్‌ను తండ్రే లూజర్ అన్నవేళ..వెలుగులోకి సంచలన విషయాలు
-
Hyderabad: రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. 7న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
KCR: కేసీఆర్‌కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు
-
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!
-
Redmi: ₹10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్.. రెడ్మీ 13సీ ఫీచర్లు ఇవే..!