ఈ నగరంలో ట్రాఫిక్‌ లైట్లే లేవ్‌!

నగరం: థింపూదేశం: భూటాన్‌విస్తీర్ణం: 26 చదరపు కిలోమీటర్లుజనాభా: లక్షకు పైమాటే* థింపూ మన పక్క దేశం భూటాన్‌లోని అతి పెద్ద నగరం. దేశ రాజధాని కూడా. వాంగ్‌ చూ నది వల్ల ఏర్పడ్డ లోయలో భలే అందంగా ఉంటుందీ నగరం.* భూటాన్‌లో రాచరికపాలన ఉంటుందని వినే ఉంటారుగా. ఆ రాజవంశీయులు ఉండేది థింపూలోనే. నేషనల్‌ అసెంబ్లీ వంటి రాజకీయ భవనాలూ ఉండేది ఇక్కడే. రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కేంద్రం ఇదే.* ఈ రాజధాని నగరంలో విమానాశ్రయం ఉండదు. ఇక్కడి నుంచి 54 కిలోమీటర్ల దూరంలో పారో ఎయిర్‌పోర్టు ఉంటుంది....

Updated : 12 Jan 2019 00:19 IST

మహా నగరం
థింపూ

ఈ నగరంలో ట్రాఫిక్‌ లైట్లే లేవ్‌!

నగరం: థింపూ
దేశం: భూటాన్‌
విస్తీర్ణం: 26 చదరపు కిలోమీటర్లు
జనాభా: లక్షకు పైమాటే
* థింపూ మన పక్క దేశం భూటాన్‌లోని అతి పెద్ద నగరం. దేశ రాజధాని కూడా. వాంగ్‌ చూ నది వల్ల ఏర్పడ్డ లోయలో భలే అందంగా ఉంటుందీ నగరం.
* భూటాన్‌లో రాచరికపాలన ఉంటుందని వినే ఉంటారుగా. ఆ రాజవంశీయులు ఉండేది థింపూలోనే. నేషనల్‌ అసెంబ్లీ వంటి రాజకీయ భవనాలూ ఉండేది ఇక్కడే. రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కేంద్రం ఇదే.
* ఈ రాజధాని నగరంలో విమానాశ్రయం ఉండదు. ఇక్కడి నుంచి 54 కిలోమీటర్ల దూరంలో పారో ఎయిర్‌పోర్టు ఉంటుంది.
*  ప్రపంచంలోనే ఎత్తయిన నగరాల్లో ఇదీ ఒకటి. సముద్రమట్టం నుంచి 2,334 మీటర్ల ఎత్తులో ఉంటుందిది.
* ఇక్కడ ఇంటర్నెట్‌, టీవీలు వచ్చింది 2001 నుంచే.
* నేషనల్‌ టెక్స్‌టైల్‌ మ్యూజియం, వీకెండ్‌ మార్కెట్‌, క్రాఫ్ట్‌ బజార్‌ వంటివీ ఇక్కడి మంచి పర్యటక ప్రాంతాలు.
* వరి, మొక్కజొన్న, గోధుమ పంటలు ఎక్కువగా పండిస్తారిక్కడ.
* 1960కి ముందు థింపూ పల్లెటూళ్ల సమూహంగా ఉండేది. 1961లో ఇది భూటాన్‌ రాజధాని అయ్యింది. 1962 నుంచే ఈ నగరంలో వాహనాలు తిరగడం మొదలైంది. తర్వాత్తర్వాత అభివృద్ధి చెందింది.

ఈ నగరంలో ట్రాఫిక్‌ లైట్లే లేవ్‌!

* ఇక్కడ బౌద్ధమతస్థులే ఎక్కువ.
* ప్రపంచంలోని ఎత్తయిన బుద్ధ విగ్రహాల్లో ఒకటి ఈ నగరంలో ఉంటుంది. ఈ విగ్రహం ఇంచుమించు 170 అడుగుల పొడవు ఉంటుంది.

ఈ నగరంలో ట్రాఫిక్‌ లైట్లే లేవ్‌!

* జాంగ్షీ హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ ఫ్యాక్టరీకి సందర్శకులు వెళుతుంటారు. ఇందులో ప్రత్యేకమైన భూటానీస్‌ పేపర్‌ని తయారు చేస్తుంటారు. ఇప్పటికీ పురాతన పద్ధతులే వాడతారు.

ఈ నగరంలో ట్రాఫిక్‌ లైట్లే లేవ్‌!

* జానపద వారసత్వాన్ని తెలిపే ఫోక్‌ హెరిటేజ్‌ మ్యూజియంలో ఇక్కడి  జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన అంశాల్ని పొందుపరిచారు.
* ఇక్కడి నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ భూటాన్‌ ప్రత్యేక ఆకర్షణ. భూటానీస్‌, టిబెటన్‌కు చెందిన 6100 పుస్తకాలు ఉంటాయి.

ఈ నగరంలో ట్రాఫిక్‌ లైట్లే లేవ్‌!

* మన దగ్గర నగరాల్లో ట్రాఫిక్‌ లైట్లు సాధారణమే. కానీ ఈ రాజధాని నగరంలో మాత్రం ఎక్కడా ట్రాఫిక్‌ లైట్లు కనిపించవు. మరి ట్రాఫిక్‌ను కంట్రోలు చేసేది ఎలా అంటారా? ‘హ్యూమన్‌ ట్రాఫిక్‌ లైట్స్‌’ ఉంటాయి. అంటే ఏంటబ్బా అంటారా? ట్రాఫిక్‌ పోలీసులే ‘ఆపండి... వెళ్లండి’ అంటూ ప్రత్యేకమైన సైగలు ఇస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని