నవ్వుల్‌.. నవ్వుల్‌!

నిజమే మరి! చిన్ను: ఏంట్రా.. పొట్ట పట్టుకుని కూర్చున్నావ్‌! ఏమైంది? బంటి: పెళ్లికి వెళ్లాం కదా. బాగా తినేశాను. ఇప్పుడు కడుపు నొప్పిగా ఉంది.

Published : 17 Apr 2021 00:42 IST

నిజమే మరి!
చిన్ను: ఏంట్రా.. పొట్ట పట్టుకుని కూర్చున్నావ్‌! ఏమైంది?
బంటి: పెళ్లికి వెళ్లాం కదా. బాగా తినేశాను. ఇప్పుడు కడుపు నొప్పిగా ఉంది.
చిన్ను: అయితే.. వెళ్లి టాబ్లెట్‌ వేసుకోవచ్చు కదా!
బంటి: చాల్లే ఆపు! టాబ్లెట్‌ పట్టేంత ఖాళీయే ఉండుంటే ఇంకో లడ్డు తినేవాణ్నిగా!
ఎలగెలగా!!

లిల్లీ: హాయ్‌ మల్లికా..! ఏంటి మామిడికాయ చేతిలో పెట్టుకుని అలా చూస్తున్నావ్‌!
మల్లిక: ఏం లేదు లిల్లీ.. నాకు మామిడి పండ్లంటే ఇష్టమని నీకు తెలుసుగా! అందుకే ఈ కాయ ఎప్పుడు పండుతుందా? ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నా!!
లిల్లీ: అయితే ఒక పని చెయ్‌.. దానికి గోరింటాకు పెట్టు.. అప్పుడు త్వరగా పండుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని