నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: పెద్దలమాట చద్దిమూట.. అంటే అర్థం ఏంటో తెలుసా?

Published : 11 Apr 2022 01:08 IST

మీరే చెప్పారు మరి!

టీచర్‌: పెద్దలమాట చద్దిమూట.. అంటే అర్థం ఏంటో తెలుసా?
టింకు: ఓ.. తెలుసు టీచర్‌!
టీచర్‌: గుడ్‌.. ఏంటో చెప్పు టింకూ!
టింకు: పెద్దలమాట ఆరోగ్యానికి హానికరం అని.. టీచర్‌!
టీచర్‌: అదేంటి?
టింకు: మొన్న మీరే చెప్పారు కదా టీచర్‌.. చల్లారిన ఆహారం తింటే అనారోగ్యం అని, వేడి వేడిగా ఉండే ఆహారమే తీసుకోవాలని!
టీచర్‌: ఆఁ!!

నిజమే సుమీ!

టీచర్‌: నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు బంటీ!
బంటి: ఈ స్కూలు బ్యాగు మోసీ మోసీ కూలీని అవుతానేమో  టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని