నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ: ఏంటి చింటూ.. చెల్లి ఏడుస్తోంది?

Published : 03 Jul 2022 01:00 IST

అన్న ప్రేమ..!

అమ్మ: ఏంటి చింటూ.. చెల్లి ఏడుస్తోంది?
చింటు: తన పళ్లు పాడవుతాయని చాక్లెట్‌ తినకుండా లాక్కున్నా అమ్మా..!

అమ్మ: అయ్యో.. ఏం కాదులేరా.. తన చాక్లెట్‌ తనకు ఇచ్చేయ్‌.
చింటు: నా పళ్లు పాడైనా ఫర్లేదు.. కానీ చెల్లి పళ్లు పాడు కాకూడదని నేనే తినేశా అమ్మా!

అమ్మ: ఆఁ!!

నేరం రుజువైంది మరి!

అమ్మ: బంటీ... ఆ చీమల్ని ఎందుకలా అగ్గిపెట్టెలో వేస్తున్నావు?
బంటి: అవి మనింట్లో నుంచి పంచదార ఎత్తుకుపోతున్నాయి. అందుకే వాటిని దొంగతనం నేరం కింద అరెస్టు చేస్తున్నా అమ్మా.

అమ్మ: ఆఁ!!

మళ్లీ ఎందుకు?

కిట్టు : నాన్నా నాన్నా.. మా ఫ్రెండ్‌ టింకూ పుట్టినరోజు పార్టీకి వెళ్తున్నాం కదా..
నాన్న : అవును వెళ్తున్నాం..

కిట్టు : వాళ్లకి ఏదైనా చదివించమని అమ్మ చెబుతోంది నాన్నా! వాళ్ల అమ్మానాన్నలు టింకూను చదివిస్తున్నారు కదా.. మళ్లీ మనం చదివించడమేంటి నాన్నా..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని