నవ్వుల్‌.. నవ్వుల్‌...!

పింకి: చింటూ.. స్కూలుకు టైం అవుతోంది. నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు?

Published : 05 Jul 2022 00:33 IST

అర్థమైందా?

పింకి: చింటూ.. స్కూలుకు టైం అవుతోంది. నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు?

చింటు: స్కూలేంటి.. రెడీ అవడం ఏంటి? అంతా మాయ.. స్కూలు ఒక మాయ.. చదువు ఒక మాయ.. పరీక్షలొక మాయ.. మార్కులూ ఓ మాయే!

పింకి:  ఆఁ!!


దటీజ్‌ టింకూ!

టీచర్‌: ‘నారు పోసినవాడే నీరు పోస్తాడు’ ఇలాంటి సామెత ఇంకోటి చెప్పు టింకూ!

టింకు: పాఠాలు చెప్పేవారే, ప్రాణాలు తోడేస్తారు... టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


ఇలా చేస్తే సరి!

కావ్య: స్మార్ట్‌ఫోన్‌ సాయంతో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలానో నీకు తెలుసా కిట్టూ?

కిట్టు: తెలియదు.. నువ్వు చెప్పు కావ్య!

కావ్య: ఏం లేదు కిట్టూ.. స్మార్ట్‌ఫోన్‌ పక్కన పడేసి చక్కగా చదువుకుంటే సరి.. మంచి మార్కులు వాటంతట అవే వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని