నవ్వుల్‌.. నవ్వుల్‌..!

రిమ్మి : నాన్నా నాన్నా.. నేను ఈ రోజు పరీక్ష చాలా బాగా రాశాను తెలుసా?

Updated : 16 Jul 2022 03:55 IST

నమ్మాలి మరి..

రిమ్మి : నాన్నా నాన్నా.. నేను ఈ రోజు పరీక్ష చాలా బాగా రాశాను తెలుసా?
నాన్న : నేను అస్సలే నమ్మను రిమ్మీ..

రిమ్మి : నువ్వు నమ్మవని నాకు తెలుసు నాన్నా.. అందుకే, ఆన్సర్‌ షీట్‌ను తీసుకొచ్చా.. కావాలంటే చూడు..
నాన్న : ఆ..!

పాయింటే కదా..!

టీచర్‌ : హరీ.. ఇంట్లోకి దోమలు రావొద్దంటే ఏం చేయాలి?
హరి : ఇంటి గేటు బయట ‘టు-లెట్‌’ బోర్డు తగిలించాలి టీచర్‌..

టీచర్‌ : అదేంటి?
హరి : అప్పుడు.. ఇంట్లో ఎవరూ లేరనుకొని దోమలు లోపలికి రావు కదా టీచర్‌..

అలా అర్థమైందా?

గోపి : అదేంటి కిట్టూ.. మీ మావయ్య సమోసా బయటిదంతా వదిలేసి, లోపలి కూరనే తింటున్నారు?
కిట్టు : ఓ అదా.. మరేం లేదు గోపీ.. మొన్న డాక్టర్‌ దగ్గరికెళ్తే, బయటి పదార్థాలు తినొద్దని చెప్పారట..

గోపి : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని