నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్నా.. నీకు చదరంగం ఆడటం వచ్చా!..

Updated : 26 Jul 2022 01:11 IST

తెలిసిపోయిందిలే!

చింటు: నాన్నా.. నీకు చదరంగం ఆడటం వచ్చా!
నాన్న: ఎందుకు రాదు! షూ వేసుకుని పద గ్రౌండ్‌కు. ఇప్పుడే ఆడదాం. అన్నట్లు ఆ బాల్‌ తేవడం మరిచిపోకు చింటూ!
చింటు: ఆఁ!!

అబ్బో మంచిపనే!

కిట్టు: టీచర్‌.. ఈ రోజు మా స్నేహితులందరం కలిసి ఓ మంచిపని చేశాం.
టీచర్‌: గుడ్‌.. ఏం చేశారు?
కిట్టు: ‘వద్దు బాబూ.. వద్దు.. నేను రోడ్డుకు ఇటువైపే వెళ్లాలి’ అని అరుస్తూ చెప్పినా వినకుండా ఓ వృద్ధుణ్ని బలవంతంగా రోడ్డుకు అటువైపు దాటించి వచ్చాం టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

సరే.. ఇంకోటి కొనుక్కో!

టింకు: నాన్నా! నా ఐస్‌క్రీం కరిగిపోయి, జారిపోయింది.
నాన్న: సరే.. ఇంకొకటి కొనుక్కో. ఇంతకీ ఎక్కడ జారిపోయింది?
టింకు: నా నోట్లో... నాన్నా!

అంతేగా.. అంతేగా...!

పీఈటీ: మీ తమ్ముడు నిన్న నాతో తనకు క్రికెట్‌, వాలీబాల్‌, గోల్ఫ్‌, ఫుట్‌బాల్‌ ఇలా బోలెడు ఆటలు వచ్చని చెప్పాడు.
చరణ్‌: వీటన్నింటికంటే.. మా తమ్ముడు ఇంకా బాగా ఆడేవి ఉన్నాయి సార్‌.
పీఈటీ: ఏంటవి చరణ్‌.
చరణ్‌: అబద్ధాలు సార్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని