నవ్వుల్‌... నవ్వుల్‌...!

చరిత: నీకు గులాబ్‌జామూన్‌లు ఎలా వస్తాయో తెలుసా?

Published : 24 Aug 2022 00:19 IST

అవాక్కయ్యారా!

చరిత: నీకు గులాబ్‌జామూన్‌లు ఎలా వస్తాయో తెలుసా?
సరిత: తెలియదు.. నీకు తెలిస్తే చెప్పు.

చరిత: గులాబీ మొక్క, జామ మొక్కను కలిపి నాటితే...
సరిత: ఆఁ!!

అయ్య బాబోయ్‌!

నాన్న: చిన్నపిల్లలు అబద్ధాలు ఆడితే ఏమవుతుందో తెలుసా?
చింటు: ఓ తెలుసు నాన్నా.. ఎంచక్కా రైళ్లలో, బస్సుల్లో టికెట్‌ లేకుండా ప్రయాణం చేయొచ్చు. సినిమా హాల్లో అయితే ఫ్రీగా సినిమా చూడొచ్చు.
నాన్న: ఆఁ!!

అదన్నమాట సంగతి!

బిట్టు: సార్‌.. ఈ నవలను అస్సలు చదవలేకపోతున్నా.
లైబ్రేరియన్‌: ఏ... ఎందుకు బిట్టూ?

బిట్టు: ఇందులో కొన్ని వేల పాత్రలున్నాయి సార్‌. ఇప్పటి వరకు సగం చదివా.. అయినా ఇంకా పాత్రల పరిచయమే పూర్తి కాలేదు.
లైబ్రేరియన్‌: ఓహో.. అయితే టెలిఫోన్‌ డైరెక్టరీ పట్టుకెళ్లింది నువ్వేనన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని