Updated : 26 Aug 2022 04:25 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మీరే చెప్పారుగా...

తాతయ్య: బిట్టూ... మందులేసుకో అంటే.. వేసుకోకుండా నవ్వుతున్నావెందుకు?
బిట్టు: ‘నవ్వును మించిన ఔషధం లేదు’ అని మీరే అన్నారు కదా తాతయ్యా! మళ్లీ మందులేసుకోవడం ఎందుకు?
తాతయ్య: ఆఁ!!

పదికి పది!

నాన్న: టింకూ... నువ్వు పది పాసైతే ఒక సైకిల్‌ కొనిస్తా.
టింకు: థాంక్యూ నాన్నా.. మరి ఒకవేళ  ఫెయిలైతే?

నాన్న: పది సైకిళ్లు కొనిస్తా.
టింకు: పది సైకిళ్లు ఎందుకు నాన్నా?

నాన్న: నీతో సైకిల్‌ షాప్‌ పెట్టించాలి కదా మరి!

అంతేగా... అంతేగా...!

టింకు: అంకుల్‌ అంకుల్‌.. మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందామా?
రన్నర్‌: ఓకే టింకూ.. ఎక్కడిదాకా?

టింకు: మా ఇంటి వరకు...
రన్నర్‌: నాకు మీ ఇల్లు తెలియదే...

టింకు: ఏం ఫర్లేదు అంకుల్‌.. నా వెనకే పరుగెత్తుకుంటూ రండి.. సరేనా!
రన్నర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని