నవ్వుల్‌...! నవ్వుల్‌...!

టీచర్‌ : కనక్‌.. ‘నేను చాక్లెట్‌ తింటున్నా’ అనే వాక్యాన్ని ఇంగ్లిష్‌లో చెప్పగలవా?

Published : 10 Sep 2022 00:18 IST

లెక్క లెక్కే..

టీచర్‌ : కనక్‌.. ‘నేను చాక్లెట్‌ తింటున్నా’ అనే వాక్యాన్ని ఇంగ్లిష్‌లో చెప్పగలవా?
కనక్‌ : మీరు ముందు చాక్లెట్‌ ఇవ్వండి టీచర్‌.. తింటూ చెబుతా..

టీచర్‌ : ఆ..!!

అలా అర్థమైందా!

కిట్టు : అమ్మా అమ్మా.. తాతయ్య ఏం చదువుకున్నాడమ్మా?
అమ్మ : అబ్బో.. ఆయన అప్పట్లోనే పీహెచ్‌డీ చేశారు కిట్టూ..

కిట్టు : ఎంత చదివితే ఏం లాభమమ్మా.. కాలాలే సరిగ్గా తెలియనప్పుడు..
అమ్మ : ఏమైందిప్పుడు?

కిట్టు : ఇది వర్షాకాలమైతే.. తాతయ్య మాత్రం కలికాలం అని అంటున్నాడు..
అమ్మ : ఆ..!!

అది చాలు..

అంకుల్‌ : రామూ.. మొన్న పండగ రోజు మీ చెల్లి మీకు చాలా సహాయం చేసిందట కదా..
రాము : అవును అంకుల్‌..

అంకుల్‌ : ఇంతకీ ఏం చేసిందేంటి?
రాము : నిద్రపోయింది అంకుల్‌..

అంకుల్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని