నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌: గుప్తనిధి అంటే ఏంటి?

Published : 15 Sep 2022 00:43 IST

అయ్యబాబోయ్‌!

టీచర్‌: గుప్తనిధి అంటే ఏంటి?
తరుణ్‌: గుప్త అనే వ్యక్తికి సంబంధించిన నిధినే గుప్తనిధి అంటారు టీచర్‌.
టీచర్‌:ఆఁ!!


ఎంత తెలివో...

టీచర్‌: నాలుగు పెంపుడు జంతువుల పేర్లు చెప్పు టింకూ?
టింకు: టామీ, బ్రౌనీ, పప్పీ, స్కూపీ..
టీచర్‌:ఆఁ!!


మీరే చెప్పారని!

తాతయ్య: ఏంటి కిట్టూ.. అలా బిగుసుకుపోయి కూర్చున్నావు?
కిట్టు: మీరే కదా తాతయ్యా.. రాయిలా కూర్చోమన్నారు.
తాతయ్య: నేను అలా అనలేదు కిట్టూ.. రా.. ఇలా కూర్చో అన్నాను.
కిట్టు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని